Natural Star Nani Birthday: నేచురల్‌ స్టార్‌ నాని ..అనుకోకుండా ఒక హీరో

Tollywood Natural Star Nani Happy Birthday special - Sakshi

నేచురల్‌ స్టార్‌, అనుకోకుండా  హీరో అయిపోయి అభిమానుల మనసు దోచుకున్న సైలెంట్‌ కిల్లర్‌  టాలీవుడ్‌ స్టార్‌హీరో నాని.  నిన్నా మొన్నటి ఈ మిడిల్‌  క్లాస్‌ అబ్బాయి తాజాగా శ్యామ సింగరాయ్‌గా సూపర్‌డూపర్‌  హిట్‌ కొట్టి టాప్‌ హీరోగా దూసుకుపోతున్నాడు.  అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించి హీరోగా  అష్టాచెమ్మా ఆడి,  భలేభలే మగాడివోయ్‌ అనిపించుకున్న నానీ కేరియర్‌ గ్రాఫ్‌పై ఒక లుక్కేద్దాం.

Happy Birthday Natural Star Nani: 1984, ఫిబ్రవరి 24 కృష్ణాజిల్లా చల్లపల్లిలో పుట్టాడు ఘంటా నవీన్‍బాబు అలియాస్‌ నానీ. రెడియో జాకీగా ఆకట్టుకున్న నానీ  సిని ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్‏గా ఎంట్రీ ఇచ్చాడు.  శ్రీను వైట్ల, బాపు వంటి  డైరెక్టర్ల వద్ద సహాయదర్శకుడిగా కరియర్‌ ఆరంభించి అనుకోకుండా హీరోగా అవతరించాడు. విలక్షణమైన నటన, విభిన్నమైన మూవీలు, డిఫరెంట్‌  స్టైల్‌తో  నాచురల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.  టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని.

 

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాలో అవసరాల శ్రీనివాస రావుతో కలిసి ప్రేక్షకులను  అలరించాడు. మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను దక్కించుకున్నాడు. దాదాపు ప్రతీసినిమా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. భీమిలీ కబడ్డీ జట్టు, అలా మొదలైంది,  పిల్ల జమిందార్‌ మూవీలు కమర్షియల్‌గాను సక్సెస్‌ అయ్యాయి. 2012లో ఎటో వెళ్లిపోయింది మనసు మూవీతో ఉత్తమనటుడుగా నంది అవార్డు అందుకున్నాడు.ఽ

ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  ‘ఈగ’ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో నాని కరియర్‌లో 2015 సంవత్సరంలో కీలక మైలురాయి అని చెప్పు కోవచ్చు. “ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు” ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలతో తన రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు. 2017 వరకు మిడిల్ క్లాస్ అబ్బాయిని అంటూ వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. 

నిర్మాతగా మారిన నాని 2014లో డీ ఫర్ దోపిడీ,  ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని  సొంతం చేసుకున్నాడు. 2018 లో కింగ్ నాగార్జున అక్కినేని గారితో దేవదాస్ సినిమాలో కలిసి నటించి ప్రశంసలందుకున్నాడు.అయితే 2018 ఏప్రిల్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం, 2019లో విడుదలైన  జెర్సీ హిట్‌ టాక్‌ సాధించినా,  ఆ తరువాత 'గ్యాంగ్ లీడర్' మూవీ  నిరాశనే మిగిల్చింది. కరోనా, లాక్‌డౌన్‌  కారణంగా  ఓటీటీలోనే విడుదలైన వీ, టక్ జగదీష్' మూవీలు కూడా  పెద్దగా  సక్సెస్‌ కాలేదు.   

రియాల్టీ షో బిగ్ బాస్-2 కి సీజన్ కి వ్యాఖ్యాతగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా శ్యామ్‌గా భారీ హిట్‌ కొట్టాడు నాని. జెంటిల్‌మ్యాన్‌ తరువాత డ్యుయల్‌  రోల్‌ పోషించిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమేకాదు,  భారీ వసూళ్లను కూడా రాబట్టింది. పునర్జన్మ, పీరియాడిక్ లవ్ స్టోరీతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీమంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top