టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ పుట్టినరోజు నేడు(సెప్టెంబరు 24)
అర్జున్ మంగళవారం 25వ పడిలో అడుగుపెట్టాడు
ఈ సందర్భంగా సచిన్ కుమార్తె, అర్జున్ అక్క సారా టెండల్కర్ అందమైన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది
‘‘మా ఇంట్లో అందరికంటే చిన్నవాడికి 25వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ప్రపంచం నువ్వే. లవ్ యూ.. నిన్ను చూసి గర్విస్తున్నా’’ అని సారా తన తమ్ముడికి విషెస్ చెప్పింది.
ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి
కాగా సారా మోడల్‌గా అర్జున్ క్రికెటర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు
అర్జున్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు


