Lavanya Tripathi Birthday Special: Happy Birthday Movie Poster Released - Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: పుట్టినరోజు ప్రత్యేకంగా 'హ్యాపీ బర్త్‌డే' పోస్టర్‌

Dec 15 2021 6:27 PM | Updated on Dec 15 2021 6:42 PM

Lavanya Tripathi Happy Birthday Movie Poster Released - Sakshi

చిత్ర టైటిల్ చుట్టూ గన్స్ చూపిస్తూ.. పక్కన ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ చూస్తుంటే ఇది ఏ తరహా చిత్రమో ఇట్టే అర్థమవుతోంది...

Happy Birthday Movie Full Details: ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బుధవారం(డిసెంబర్‌ 15) హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ రిలీజ్‌ చేసింది. నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తోంది. చిత్ర టైటిల్ చుట్టూ గన్స్ చూపిస్తూ.. పక్కన ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ చూస్తుంటే ఇది ఏ తరహా చిత్రమో ఇట్టే అర్థమవుతోంది. టోటల్‌గా ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులకి మంచి పార్టీ రెడీ అవుతుందనేలా పోస్టర్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె బర్త్‌డే రోజే.. ‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రీసెంట్‌గానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ చిత్రంతో దర్శకుడు రితేష్ రానా ప్రేక్షకులను హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మంచి తారాగణం కుదిరింది. టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..’’ అని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement