MS Dhoni Used To Say He Wants To Earn 30 Lakh And Spend Rest Of His Life In Ranchi - Sakshi
Sakshi News home page

#HappyBirthdayMSD: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా'

Published Fri, Jul 7 2023 3:08 PM

Dhoni Used-To-Say-He Wants-Earn-30 lakh-Spend Rest-Of-His-Life Ranchi - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్‌ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ 16వ సీజన్‌ చాలు ధోని క్రేజ్‌ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసిన రోజున ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్‌ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్‌గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో చూసే అవకాశం ఉంది.

ఇక ధోని బర్త్‌డే పురస్కరించుకొని టీమిండియా క్రికెటర్లు సహా పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ధోనితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ధోనికి 

"ముందు నా ప్రియ మిత్రుడు ఎంఎస్‌ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను 2005లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ధోనీ టీమ్కు కొత్త. 2004 డిసెంబర్ లో జట్టులోకి వచ్చాడు. వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాడిని. మేము వెనుకాల కూర్చునే వాళ్లం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ఆర్పీ సింగ్ వెనుకాల సీట్లలో కూర్చునే వాళ్లం. అప్పట్లో మేమంతా వెనుకాల కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్లం.

అతడు రైల్వేస్ లో పని చేసేవాడని మనందరికీ తెలుసు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం చాలా తిరిగేవాడు. అంత చేసినా ఆడే అవకాశం మాత్రం వచ్చేది కాదు. అప్పట్లో అతడు ఆ జాబ్ వదిలేశాడనుకుంటా. రూ.30 లక్షలు సంపాదించి తన జీవితం మొత్తం హాయిగా రాంచీలో గడిపేస్తానని.. ఎట్టిపరిస్థితుల్లో రాంచీ వదలనని చెప్పేవాడు. క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో రూ.30 లక్షలు సంపాదిస్తే చాలు.. నా జీవితం ప్రశాంతంగా గడిపేస్తా అనేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు" అని జాఫర్ వెల్లడించాడు.

చదవండి: MS Dhoni: ధోని బర్త్‌డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్‌ ట్వీట్‌! వైరల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement