సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కానీ 18.4 ఓవర్లలోనే టీమిండియా 165 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలొ శివమ్ దూబె 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రింకు సింగ్ 39, సంజు శాంసన్ 24 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ డకౌటవ్వగా సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు, హార్దిక్ పాండ్య 2 పరుగులు మాత్రమే చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీయగా, జాకబ్ డఫీ , ఇష్ సోధి చెరో రెండు వికెట్లు, మ్యాట్ హెన్రీ, జాక్ ఫౌక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో డారిల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-2), కుల్దీప్ యాదవ్ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.


