న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ | IND VS NZ 4th T20I: Team india won the toss and choose to bowl, here are playing XI | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Jan 28 2026 6:35 PM | Updated on Jan 28 2026 7:05 PM

IND VS NZ 4th T20I: Team india won the toss and choose to bowl, here are playing XI

వైజాగ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్‌మెంట్‌ ఇషాన్‌ కిషన్‌ను పక్కన పెట్టింది. గత మ్యాచ్‌లో అతను స్వల్ప గాయానికి గురయ్యాడు. అతని స్థానంలో అర్షదీప్‌ సింగ్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఓ మార్పుతో బరలోకి దిగింది. జేమీసన్‌ స్థానంలో ఫౌల్క్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం​ లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

తుది జట్లు..
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Advertisement
 
Advertisement
Advertisement