జూన్ 12 నుంచి ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. నేపాల్‌లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ప్రపంచకప్ క్వాలిఫయర్) థాయ్‌లాండ్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
మరోవైపు నెదర్లాండ్స్ జట్టు తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, థాయ్‌లాండ్, నేపాల్, జింబాబ్వేపై వరుస విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించిన నెదర్లాండ్స్.. టాప్-4లో (సూపర్ సిక్స్‌లో) బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. సూపర్-6 దశలో టాప్-4లో నిలిచే జట్లు ప్రపంచకప్ బెర్త్‌లను దక్కించుకుంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ టికెట్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి.
కాగా, జూన్ 12న బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.


