
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇవాళ(అక్టోబర్ 11న) 29వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది రోజుల్లో టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. టీమిండియాతో కలిసి పాండ్యా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విషయం పక్కనబెడితే పుట్టినరోజునాడే హార్దిక్ పాండ్యా ఎమెషనల్ అయ్యాడు. అందుకు కారణం తన కొడుకు అగస్త్యను మిస్ అవడమేనట. బర్త్‌డే వేడుకలు ఫ్యామిలీ సమక్షంలో జరగనందుకు కాస్త బాధ ఉందని.. అయితే దేశం కోసం ఆడుతున్నాం కాబట్టి ఇవన్నీ పక్కనబెట్టేస్తానని పేర్కొన్నాడు. కాగా ట్విటర్ వేదికగా తన కొడుకు అగస్త్యతో ఉన్న అనుబంధాన్ని హార్దిక్ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ''నా పుట్టినరోజున అగస్త్యను చాలా మిస్సవుతున్నా.. వాడు నా జీవితంలోకి రావడమే పెద్ద గిఫ్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక టి20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీమిండియా నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పాండ్యా..టి20 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. జట్టులో ఐదో బౌలర్ రోల్‌తో పాటు చివర్లో దినేష్‌కార్తీక్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేసే బాధ్యత హార్దిక్ పాండ్యాపైన ఉంది.
వెన్నునొప్పి, ఫేలవ ఫామ్‌తో టీమిండియాలో స్థానం కోల్పోయిన పాండ్యా సర్జరీ తర్వాత ఐపీఎల్ 2022లో రీఎంట్రీ ఇచ్చాడు. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ వ్యవహరించి తొలి సీజన్‌లోనే ఆ జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా నడిపించడంతో పాటు ఆల్‌రౌండర్‌గానూ రాణించాడు.
Missing my boy a little bit more on my birthday ❤️ The best gift I've received 😘🥰🤗 pic.twitter.com/So6ddl4d4q
— hardik pandya (@hardikpandya7) October 11, 2022