Shumban Gill: పుట్టినరోజున అదరగొట్టాడు.. నైంటీస్ ఫోబియా మాత్రం వదల్లేదు

టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఇవాళ(గురువారం) 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆసియాకప్‌లో ఆడుతున్న టీమిండియా జట్టుకు ఎంపిక కాని గిల్ కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. కాగా పుట్టినరోజునాడే గిల్ తన డెబ్యూ కౌంటీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. కౌంటి డివిజన్-1లో గ్లామోర్గాన్ తరపున ఆడుతున్న గిల్ వోర్సెస్టర్‌షైర్‌పై 92 పరుగులు సాధించాడు. అయితే 8 పరుగుల తేడాతో తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
కాగా గిల్‌కు నెర్వస్ నైంటీస్ ఫోబియా ఉంది. ఇటీవలి కాలంలో గిల్ 90ల్లో చాలాసార్లు ఔటయ్యాడు. ఈ మధ్య జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ తొలిసారి నైంటీస్ ఫోబియాను అధిగమించి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజాగా మాత్రం మరోసారి 90ల్లోనే ఔటయ్యి నిరాశపరిచాడు. కాగా గిల్ 148 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 92 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ కూక్ 51 నాటౌట్, ఎడ్‌వార్డ్ బైరోమ్ 67 పరుగులు చేశాడు.
ఈ ముగ్గురు మినహా మిగతవారు విఫలం కావడంతో గ్లామోర్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. కాగా వోర్సెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 454 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రోడ్రిక్ 172 పరుగులు నాటౌట్ అజేయ సెంచరీతో మెరవగా.. బర్నార్డ్ 75, జాక్ లీచ్ 87, ఎడ్ పొలాక్ 54 పరుగులు చేశారు. ఇక ఫాలోఆన్ ఆడుతున్న గ్లామోర్గాన్ వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. గ్లామోర్గాన్ ఇంకా 154 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా..
ఆఫ్ఘన్ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ బ్యాటర్.. వైరల్ వీడియో