సెంచరీ దాటేసిన బక్కమ్మ.. ఎక్కడ? | Birthday celebrations for centenarian woman at warangal | Sakshi
Sakshi News home page

సెంచరీ దాటేసిన బక్కమ్మ.. ఎక్కడ?

May 3 2025 11:54 AM | Updated on May 3 2025 1:30 PM

Birthday celebrations for centenarian woman at warangal

బక్కమ్మ @105

ఖానాపురం: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి 105వ జన్మదిన సంబరాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధురాలైన చీమల బక్కమ్మ 104 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుని 105వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కతాటిపైకి చేరుకుని శుక్రవారం గ్రామంలో ఆనందోత్సవాల నడుమ జన్మదినాన్ని నిర్వహించారు. బక్కమ్మకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరి తరఫు కుటుంబమంతా (121) మంది బుధరావుపేటలో శుక్రవారం కలుసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించారు.

‘‘సెంచరీలు  కొట్టే వయసు మాది పాడుకోవడం కాదమ్మా... ‘శతాయుష్షు’ అనే ఆశీస్సుకు అసలైన అర్థంలా బతకాలి.  ఆరోగ్యంగా,  ఉత్సాహంగా ఉంటూ జీవితంలో సెంచరీ కొట్టేయాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి’’  అంటోంది శతాధిక మహిళ. 

ఇదీ చదవండి: Vegan ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!

నూరేళ్లు బతకాలనే కల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా మన జీవన శైలి ఉండాలి. ఒత్తిడి లేని , సంతోషకరమైన జీవితం. ఎలాంటి కష్టాన్నైనా సానుకూలంగా  మల్చుకుంటూ ముందుకు సాగిపోయే తత్వం,  చక్కటి ఆహార నియమాలు, వ్యాయామం  ఇవన్నీ   సుదీర్ఘ కాలం జీవించేందుకు దోహదపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement