
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ 60వ పుట్టినరోజు (మార్చి 14) జరుపుకుంటున్నారు

అమిర్ ఖాన్ ఇప్పటికే రీనా దత్తా, కిరణ్ రావుతో కలిసి ఏడడుగులు వేశారు.. ఆపై కొంతకాలం తర్వాత విడిపోయారు

తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పలు విషయాలను అమీర్ పంచుకున్నారు

తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నమాట వాస్తవమేనని ఆయన వెల్లడించారు

ఆమె తనకు దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుసని అమిర్ స్పష్టం చేశారు

గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు అమిర్ ఖాన్ వెల్లడించారు. అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్‌లో పనిచేస్తోందని వివరించారు.

ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారని అమిర్ వివరించారు

తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లను పుట్టినరోజు విందుకు ఆహ్వానించినట్లు అమిర్ ఖాన్ తెలిపారు. ఆ పార్టీకి గౌరీ స్ప్రాట్ వచ్చిందని వెల్లడించారు

ఆమె సగం తమిళియన్ కాగా.. మరో సగం ఐరిష్ మహిళ అని ఆయన అన్నారు

కిరణ్ రావుతో విడాకులు తీసుకుంటున్నట్లు 2021లోనే అమిర్ ప్రకటించారు. వారికి ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు

మొదల రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమిర్.. వారిద్దరూ 2002లోనే విడిపోయారు. వీరికి ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు





