2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు! | Nirmala Sitharaman Union Budgets Times From 2019 To 2025 | Sakshi
Sakshi News home page

2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!

Jan 30 2026 5:44 PM | Updated on Jan 30 2026 6:18 PM

Nirmala Sitharaman Union Budgets Times From 2019 To 2025

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఎనిమిది బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. అయితే ప్రారంభం నుంచి ఏ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం?, సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలా సీతారామన్ అందించారు. కరోనా వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా.. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 2 గంటలు 42 నిమిషాలు కొనసాగి, భారత పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపు పొందింది.

కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుధీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు, తరువాతి సంవత్సరాల్లో.. క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం 56 నిమిషాల్లో (గంట లోపు) పూర్తయింది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన అత్యంత చిన్న ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం (74 నిముషాలు)లోనే పూర్తి కావడం విశేషం.

బడ్జెట్ - ప్రసంగ సమయం
➤2019 బడ్జెట్: 140 నిముషాలు (2 గంటల 20 నిముషాలు)
➤2020 బడ్జెట్: 160 నిముషాలు (2 గంటల 40 నిముషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)
➤2021 బడ్జెట్: 100 నిముషాలు (1 గంట 40 నిముషాలు)
➤2022 బడ్జెట్: 91 నిముషాలు (1 గంట 31 నిమిషాలు)
➤2023 బడ్జెట్: 87 నిముషాలు (1 గంట 27 నిముషాలు)
➤2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిముషాలు
➤2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిముషాలు)
➤2025 బడ్జెట్: 74 నిముషాలు (1 గంట 14 నిముషాలు) మొత్తం 8 బడ్జెట్‌లు.. 793 నిముషాలు / 13 గంటల 13 నిముషాలు

ఇక 9వ బడ్జెట్‌తో ఆమె మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం సాగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2026 బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement