
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లు తమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటూ, ఈ తరుణంలో తక్షణ ఉపశమన చర్యలను ప్రకటించాలంటూ రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (GJEPC) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)ను కోరింది. బుధవారం మంత్రితో జీజేఈపీసీ ప్రతినిధులు సమావేశమై తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
అమెరికాతో వాణిజ్య సంప్రదింపులను తిరిగి ప్రారంభించడం ప్రోత్సాహకరమంటూనే.. పరిశ్రమ నిలదొక్కుకోవడానికి తక్షణ ఉపశమన చర్యలు ప్రకటించాల్సిన అవసరాన్ని జీజేఈపీసీ ప్రతినిధి బృందం ప్రస్తావించింది. చర్చలు ఫలవంతం అయ్యేందుకు సమయం పడుతుందని, ఈ లోపు ఉపాధి అవకాశాలు కోల్పోకుండా చూసేందుకు మద్దతు చర్యలు అవసరమని గుర్తు చేసింది.
‘ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లోని యూనిట్లు రివర్స్ జాబ్ వర్క్ (ఎగుమతుల కోసం కాకుండా దేశీ తయారీదారులు, రిటైలర్ల కోసం ఉత్పత్తి చేయడం) చేపట్టేందుకు, దేశీ టారిఫ్‌ల కింద విక్రయాలకు అనుమతించాలని కోరాం. రుణాలపై మార టోరియం, మూలధన రుణాలపై వడ్డీ రాయితీ అందించడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని తెలి యజేశాం’అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. ఈ చర్యలతో ఉద్యోగాలను, ఎగుమతిదారుల పోటీతత్వాన్ని కాపాడుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!