
మీరు ధనవంతుల ఇంటికి గానీ, బాగా డబ్బు సంపాదించడం ప్రారంభించిన వారి ఇంటికి వెళ్లినప్పుడు వారి బాగోగుల గురించి తెలుసుకోవడంతోపాటు డబ్బుకు సంబంధించిన సలహా అడగండి. కొన్నిసార్లు మీకు సలహా కావాలంటే డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. డబ్బుకు సంబంధించిన కొన్ని అంశాలను కింద తెలుసుకుందాం.
డబ్బు వర్సెస్ సలహా
మీకు డబ్బు కావాలంటే సలహా అడగండి. ఆ సలహా కావాలంటే కొన్నిసార్లు డబ్బు ఇచ్చి అడగండి. ఈ రోజుల్లో ఎవరినైనా డబ్బు అడిగితే కొంతసేపు ఆలోచిస్తారు, డౌట్ పడతారు, చివరికి డబ్బులు లేవని చెప్తారు. ఎందుకంటే డబ్బు ఇతరులకు ఇవ్వడం అనేది రిస్క్. అదే మీరు ఎవరినైనా ఒక సలహా అడగండి. వారు ఎలా ఫీల్ అవుతారు.. కొంచెం గౌరవంగా ఫీల్ అయి మీతో నాలెడ్జ్ పంచుకుందాం అని అనుకుంటారు. మీకు అవసరం ఉంటే కొన్నిసార్లు డబ్బు సాయం చేయడానికి కూడా వెనకాడారు.
ఒక ఉదాహరణ చూద్దాం రవి అనే ఒక వ్యక్తి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. తన అంకుల్ దగ్గరికి వెళ్లి డైరెక్ట్‌గా రూ.50,000 రూపాయలు కావాలని అడిగాడు. ఆయన కొంతసేపు బాగా ఆలోచించాడు. రవికి డబ్బులు ఇస్తే లాస్ అవ్వొచ్చు. తిరిగి ఆ డబ్బులు ఇవ్వకపోవచ్చు. అనవసరంగా రిలేషన్‌షిప్ పాడవుతుంది. అందుకని డబ్బులు లేవని చెప్పాడు. కానీ రవి డైరెక్ట్‌గా రూ.50,000 కావాలని అడగకుండా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి? అని అడిగాడు అనుకోండి అతడు ఇంప్రెస్ అయిపోయి రవి సీరియస్‌నెస్, ప్రిపరేషన్ చూసి తాను కొంత ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేద్దాం అని అనుకుంటాడు. అందుకే డబ్బు కావాలంటే సలహా అడగండి.
మీకు ఇన్సూరెన్స్ విషయంలోనూ, మ్యూచువల్ ఫండ్ల విషయంలోనో ఎందరినో సలహా అడిగితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉచిత సలహాలు ఇవ్వొచ్చు. కానీ మీరు కొంత కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సలహా అడిగారనుకోండి. అతడు మీకు అన్ బయాస్డ్ అడ్వైజ్ ఇస్తారు. ఎందుకంటే మీ సీరియస్‌నెస్‌ను అడ్వైజర్ అర్థం చేసుకుంటాడు. దాంతో పాటు ఒకరి సమయానికి ఒకరు విలువ ఇచ్చుకున్నట్లుగా భావిస్తారు.
ఉద్యోగస్థులు వర్సెస్ జీతం
కేవలం జీతం కోసం పని చేసేవారు జీవితాంతం ఉద్యోగస్థులుగానే ఉండిపోతారు. ఏ ఉద్యోగస్థులైతే వ్యాల్యూ కోసం పని చేస్తారో వారు లీడర్లుగా, ఆంత్రప్రెన్యూర్లుగా ఎదుగుతారు. మైండ్‌సెట్‌ను బట్టి ఉద్యోగస్థులు రెండు రకాలు.. ఒకటి శాలరీ ఫోకస్డ్ మైండ్ సెట్. వీరు ఎంత అవసరమో అంత పని మాత్రమే చేస్తారు. ఎక్కువ చేయరు.. తక్కువ చేయరు.
ఇక రెండో రకం వ్యాల్యూ ఫోకస్డ్ మైండ్‌సెట్ ఉన్నవారు. వీరు తాము ఇంకా బెటర్‌గా ఎలా చేయగలరో.. ఇంకా వ్యాల్యూ ఏమైనా యాడ్ చేయగలనా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకు సుందర్ పిచాయ్ ఒక మంచి ఉదాహరణ. ఆయన కంపెనీకి ఓనర్ కాదు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చి గూగుల్‌లో చిన్న ఎంప్లాయిగా జాయిన్ అయి ఈరోజు గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్‌కు సీఈఓగా ఎదిగారు. ఇదంతా ఎలా సాధ్యపడింది? కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, దాంతో కంపెనీకి వ్యాల్యూ యాడ్ చేయడం, ఇన్నోవేటివ్‌గా ఉండడం, క్రియేటివ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తూండడంతోనే కదా. మీరు కూడా ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. గమనించండి.
రిచ్ వర్సెస్ పూర్ వర్సెస్ టైమ్
ధనవంతులు, పేదవారికి మధ్య ఉన్న ఏకైక తేడా తమ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది. ప్రతి ఒక్కరికి రోజులో 24 గంటలే ఉంటాయి. ఎవరైతే తమకున్న ఒక్కో నిమిషాన్ని తమ లక్ష్యాలు పూర్తి చేసుకోవడానికి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉపయోగించుకుంటారో వారు రిచ్ అవుతారు. ‘టైమ్ ఈజ్ మనీ’ అనేది అందుకే. ఎవరైతే తమ సమయాన్ని వృధా చేస్తారో.. రోజంతా సోషల్ మీడియా, సినిమాలు.. వంటివాటికి గడుపుతుంటారో వారు పేదవారిగానే ఉంటారు.
చివరగా ఒక్క విషయం మీరు ఎవరు అంటే.. మీ చుట్టూ ఉండే ఐదుగురు వ్యక్తుల యావరేజ్. ఆ వ్యక్తులు క్వాలిటీ వ్యక్తులయితే మీరు మీ సమయాన్ని క్వాలిటీగా గడుపుతున్నట్టు లెక్క.
ఇదీ చదవండి: స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ మంచిదా?