ఎనిమిదో వార్డు ఓటర్లతో వాగ్వాదం చేస్తున్న మహేశ్
ఉప సర్పంచ్ పదవి దక్కలేదని..
ఆసిఫాబాద్ రూరల్/జూలూరుపాడు: ఉప సర్పంచ్ పదవి దక్కని ఓ మాజీ సర్పంచ్ ఓట ర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేసిన ఘటన కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చిలాటిగూడ పంచాయతీలో ఎకోన్ కార్ మహేశ్ ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఏడు స్థానాల్లో తన మద్దతుదారు లను నిలబెట్టాడు. వీరిలో మహేశ్ ఒక్కడే గెలిచాడు. మిగిలిన ఆరు స్థానాల్లో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు విజయం సాధించగా, ఉప సర్పంచ్‌గా వినోద్‌ను ఎన్ను కున్నారు. దీంతో మహేశ్ ఉపసర్పంచ్ పదవి దక్కలేదని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శుక్రవారం ఎనిమిదో వార్డు బెస్తవాడ ఓటర్లతో వాగ్వా దానికి దిగారు.
ఓటు వేయలేదని ధాన్యం తడిపిన నేత
భద్రాద్రిజిల్లా జూలూరుపాడు మండలం గంగారంతండాకు చెందిన చిన్న రాములు రెండెకరాల్లో వరిసాగు చేయగా, కోత అనంతరం కల్లంలో ఆరబోశాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఓటు వేయాలని చిన్న రాములుకు అదే గ్రామానికే చెందిననేత సామ్యా సూచించాడు. అయితే, రాములు ఓటు వేయలేదనే భావనతో కల్లం పక్కనే ఉన్న తన పొలంలోని మోటార్ గురువారం రాత్రి ఆన్ చేయగా 60 బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది.


