సమ్మె నోటీసు అందజేత
కౌటాల: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నామని మంగళవారం మండ ల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ని ఆశవర్కర్లు అధికారులకు సమ్మె నోటీసు అందించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ ఆశవర్కర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశా రు. నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు, నిబంధనలు రద్దు చేయాలని, ఆశవర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశవర్కర్లు అనిత, మోగ్రా, రాజేశ్వరి, సునీత, అర్చన, నిర్మల, చంద్రకళ, జ్యోతి, నవీన తదితరులు పాల్గొన్నారు.


