ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీ క్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని ఆదేశించా రు. గిరిజన విద్యాభివృద్ధికి అంకిత భావంతో పని చేయాలన్నారు. ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో షేకు, ఏటీడీవో చిరంజీవి, రిసోర్స్‌పర్సన్లు కృష్ణ, నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్, గణపతి తదితరలు పాల్గొన్నారు.


