వెనక్కి తగ్గని రెబెల్స్
రెండు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో కాంగ్రెస్ నుంచి మెంగ్రె మోహన్, వైరాగడే గోవిందు కాంగ్రెస్ టికెట్లు ఆశించగా పార్టీ అధిష్టానం మెంగ్రె మోహన్‌కు బీఫాం ఇచ్చింది. దీంతో వైరాగడే గోవిందు రెబెల్‌గా బరిలో నిలిచారు. 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సాయికి బీఫామ్ దక్కగా.. అప్పటి వరకు టికెట్ ఆశించిన తపాసె శ్రీనివాస్ రెబెల్‌గా బరిలో ఉన్నారు. అలాగే 11వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది రాపర్తి రవీందర్‌కు టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ టికెట్ ఆశించిన రామగిరి సంగీత సైతం బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ 11వ వార్డు అభ్యర్థి రాపర్తి రవీందర్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో అదే వార్డులో రెబెల్‌గా ఉన్న సంగీతను ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలు నచ్చజెప్పినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చివరికి బరిలో నిలిచేందుకే మొగ్గు చూపారు. 10వ వార్డులో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఓయూ జేఏసీ నాయకుడు అనిల్‌కుమార్ తన తల్లి కామ్రె భాగ్యలక్ష్మిని బరిలో నిలిపారు.


