మందకొడిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

మందకొడిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌

Feb 4 2026 7:09 AM | Updated on Feb 4 2026 7:09 AM

మందకొడిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌

మందకొడిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌

● ఐదు నెలలైనా 50 శాతం దాటలే.. ● రైతులకు అవగాహన లేక నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియ

ఉన్న రైతులు అయిన వారు

దహెగాం: దేశాభివృద్ధిలో అన్నదాతల ప్రాముఖ్యత గుర్తించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల మాదిరిగానే వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్‌ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా ఆధార్‌ తరహాలోనే పదకొండు అంకెలతో కూడిన యూనిక్‌ ఫార్మర్‌ ఐడీ కేటాయిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఐదు నెలలైనా రైతుల వివరాల నమోదు 50శాతం దాటలేదు.

సంక్షేమ పథకాలకు తప్పనిసరి..

జిల్లాలోని 15 మండలాల్లో 1,16,552 మంది రైతులు పట్టా పాస్‌పుస్తకాలు కలిగి ఉన్నారు. 59,392 మంది ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 58,921 మందికి ఐడీ క్రియేట్‌ అయ్యింది. పీఎం కిసాన్‌ వంటి ఇతర కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. క్లస్టర్‌ల వారీగా ఏఈవోలు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. జనవరి 29 వరకు జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ 50.96 శాతమే పూర్తయ్యింది. జైనూర్‌, కౌటాల, లింగాపూర్‌, సిర్పూర్‌(యు), తిర్యాణి మండలాల్లో మాత్రమే 60 శాతానికి చేరుకుంది. మిగతా మండలాలు కెరమెరిలో 50 శాతం పూర్తికాగా, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి), వాంకిడి, పెంచికల్‌పేట్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, దహెగాం, రెబ్బెన, చింతలమానెపల్లి మండలాల్లో సగం కూడా దాటలేదు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించకపోవడంతోనే ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు

రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి సమీ పంలో ఉన్న ఏఈవోలు, మీసేవ కేంద్రాల వద్దకు వెళ్తుండగా.. వారికి అనేక సాంకేతిక సమస్యలు ఎ దురవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఓటీపీ సమయానికి రాకపోవడం, రైతులకు ఫోన్లు లేకపోవడం, ఉన్నా ఆధార్‌ లింకు కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఒకే రైతుకు రెండుచోట్ల భూమి ఉండడం, భూమి ఉన్న వారు స్థానికంగా లేకపోవడం, మరణించిన వారి పేరుపై భూమి ఉండి కుటుంబ సభ్యులు విరాసత్‌ చేయించుకోకపోవ డం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసా య అధికారులు చెబుతున్నా రు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ వివరా ల నమోదుకు ప్రస్తుతం తుది గడువు లేదని, వచ్చే పీఎం కిసాన్‌ నగదు రైతుల ఖాతా ల్లోకి జమ చేసే ముందు గడు వు పెట్టే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.

ఉపయోగాలు ఇవే..

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ కార్డు, పట్టా పాసుపుస్తకం జిరాక్స్‌, ఆధార్‌ లింకు అయిన మొబైల్‌ నంబర్‌తో స్థానిక ఏఈవోలను సంప్రదించాలి. అలాగే మీసేవ కేంద్రాల్లో సైతం రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఒకసారి ఐడీ పూర్తయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు. పీఎం కిసాన్‌ సాయం పొందేందుకు ఐడీ తప్పనిసరి చేశారు. ఒకే ఐడీ ఉండడం ద్వారా లబ్ధిదారుకు నేరుగా బ్యాంకు ఖాతాలోకి ఆర్థికసాయం అందిస్తారు. బీమా, రాయితీలు, రుణాలు, పథకాలు త్వరగా అందుతాయి. భవిష్యత్తు పథకాల ప్రయోజనాలు స్పష్టమైన గుర్తింపుతో పక్కదారి పట్టే అవకాశం ఉండదు.

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ వివరాలు(జనవరి 29 వరకు)

మండలం పట్టా పాసుపుస్తకం రిజిస్ట్రేషన్‌ శాతం

జైనూర్‌ 3,914 2,728 69.70

కౌటాల 7,547 5,111 67

లింగాపూర్‌ 2,586 1,746 67

సిర్పూర్‌(యు) 3,423 2,162 63

తిర్యాణి 6,920 4,153 60

కెరమెరి 4,607 2,585 56

బెజ్జూర్‌ 8,483 4,175 46

సిర్పూర్‌(టి) 7,147 3,516 49

వాంకిడి 9,085 4,352 47

పెంచికల్‌పేట్‌ 5,688 2,718 47

ఆసిఫాబాద్‌ 11,965 5,619 46

కాగజ్‌నగర్‌ 12,920 5,853 45

దహెగాం 12,357 5,180 41

రెబ్బెన 12,073 5,056 41

చింతలమానెపల్లి 7,837 3,206 40

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement