అటవీ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
పెంచికల్‌పేట్: మండలంలోని గుండెపల్లిలో అటవీశాఖ అధికారులను మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కిచెన్ షెడ్ నిర్మాణానికి గ్రామస్తులు భూమిపూజ చేసి పునాది పనులు ప్రారంభించారు. సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో పనులు చేపడుతున్నారని పునాది కూల్చివేశారు. ఉద యం గ్రామానికి వచ్చిన అటవీశాఖ అధికారులను గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి ది గారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అటవీశాఖ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని సర్దిచెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.


