ఆధునిక సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొన్ని నమ్మశక్యం కానీ సమాచారాలను కూడా ఏఐ సాయంతో అవలీలగా వ్యాప్తి చేస్తున్నారు. అలాంటిదే ఇది.. 24 గంటల్లో రూ.60 వేలు.. ‘నెలకు రూ.10 లక్షలు సంపాదించే పెట్టుబడి పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
నకిలీ వార్తను ఛేదించిన పీఐబీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీని గురించి పూర్తి అవగాహన లేనివారు ఎటువంటి ధ్రువీకరణ లేకుండానే వ్యాప్తి చేస్తున్నారు. అయితే ఇది ఏఐ మానిప్యులేటెడ్ వీడియో అని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ తేల్చింది.
'ఈజీగా రోజువారీ ఆదాయం వచ్చే 'పెట్టుబడి పథకం' కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు అంటూ ఫేస్‌బుక్‌లో ఒక వీడియో చలామణిలో ఉంది. ఆర్థిక మంత్రి లేదా భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ప్రారంభించలేదు లేదా ఆమోదించలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ‘ఎక్స్’ (ట్విటర్)లో అధికారిక పోస్ట్లో తెలిపింది.
"అలాంటి త్వరగా ధనవంతులవుతారని చెప్పే ఉచ్చులలో పడకండి! అప్రమత్తంగా ఉండండి. సమాచారం ఇవ్వండి. మీరు షేర్ చేసే ముందు ధృవీకరించుకోండి" అని పీఐబీ తెలిపింది. యూజర్లు అప్రమత్తంగా ఉండటానికి, స్కామ్లను గుర్తించడానికి కొన్ని సూచనలను చేసింది.
ఇదీ చదవండి: ‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’
ఇలాంటి వీడియోల్లో మాట్లాడుతున్నవారి పెదవుల కదలిక, అసహజమైన వాయిస్ సింక్ గమనించాలి. వీడియోల్లో చూపిస్తున్న తేదీ, బ్యాక్గ్రౌండ్, లోగో వంటివి సరిపోలాయా లేదా అన్నది పరిశీలించాలి. అధికారిక ప్రభుత్వ డొమైన్లు ఎల్లప్పుడూ .gov.in అనే ఎక్స్టెన్షన్తో ముగుస్తాయి. షేర్ చేసేముందు ఆ లింక్లను ధ్రువీకరించుకోవడం అవసరం.
💥 Earn ₹60,000 in 24 hours & ₹10 Lakhs a month!
🚨Sounds tempting❓ 💸 Think Again‼️
A video on Facebook falsely shows Union Finance Minister @nsitharaman promoting an 'investment program' that promises easy daily income.#PIBFactCheck ✅
❌ FAKE ALERT!
👉The video is… pic.twitter.com/QsUkFkrYYW— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2025


