ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బిట్కాయిన్, బంగారం(Gold), వెండి పెట్టుబడులకు సంబంధించి తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చాలా మంది యూట్యూబ్ జాకీలు భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
రాబర్ట్ కియోసాకి తన తాజా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో "ఫియర్ క్లిక్ బైటింగ్" గురించి విమర్శించారు. వ్యూస్, సబ్స్కైబర్లను పెంచుకోవడానికి ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లు ఆర్థిక మార్కెట్ల గురించి ముఖ్యంగా బిట్ కాయిన్, బంగారం, వెండి గురించి భయంకరమైన అంచనాలను పోస్ట్ చేస్తున్నారన్నారు.
"చాలా మంది యూట్యూబ్ జాకీలు... 'ఫియర్ క్లిక్ బైట్స్' తో మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.. 'బిట్ కాయిన్ క్రాష్ కాబోతోంది.. లేదా బంగారం, వెండి పతనం కానున్నాయి' వంటి అంచనాలను చెబుతున్నారు. తర్వాత 'నా వెబ్ సైట్ కు సబ్ స్క్రైబ్ చేయండి' అంటూ అడుక్కుంటున్నారు. ఎంత మోసం?" అంటూ కియోసాకి రాసుకొచ్చారు.
నిజమైన ఆస్తులను కలిగి ఉండటంపై తన నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కియోసాకి, ఆ మార్కెట్లలో భవిష్యత్తులో ఏదైనా తిరోగమనం వస్తే మరింత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. "వాళ్లు చెబుతున్నట్లు ఒకవేళ బిట్కాయిన్, ఎథేరియం, బంగారం, వెండి వంటివి క్రాష్ అయితే ఆ తగ్గిన ధరలకు మరింత ఎక్కువ కొనుగోలు చేస్తాను" అన్నారు.
ఇదీ చదవండి: షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు
"అసలు సమస్య నకిలీ డబ్బు, అసమర్థ నాయకులు.. లక్షల కోట్లలో ఉన్న జాతీయ రుణం." అని పేర్కొన్న రాబర్ట్ కియోసాకి యూఎస్ డాలర్ "ఫేక్ మనీ" అని చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రియల్ మనీ అని చెప్పే బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటివాటిని పోగుచేసుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు.
FEAR CLICK BAITING:
Many You Tube jockeys, vs old time Radio Disc Jockies….lure you in with “Fear Click Baits.”
They state such predictions as “Bitcoin to crash.” Or “Gold and silver to crash.”
Then they say “ Subscribe to my website.”
How phoney. How fake?”
If the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 27, 2025


