కో–లివింగ్‌.. ఇన్వెస్ట్‌మెంటే!  | Co-living segment gains traction in India | Sakshi
Sakshi News home page

కో–లివింగ్‌.. ఇన్వెస్ట్‌మెంటే! 

Dec 15 2025 3:27 AM | Updated on Dec 15 2025 3:27 AM

Co-living segment gains traction in India

ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న ట్రెండ్‌

సాధారణ అద్దెతో పోలిస్తే కో–లివింగ్‌తో ఎక్కువ ఆదాయం

అద్దెకన్నా వార్షికంగా 35–40 శాతం ఎక్కువ వచ్చే అవకాశం

నిర్వహణ మొత్తం చూసుకునేందుకు  ప్రత్యేక ఏజెన్సీలు

విజయవాడ, వైజాగ్‌ తదితర ప్రాంతాల్లో డిమాండ్‌

స్మార్ట్‌ ఇన్వెస్టర్లకు ఇదో కొత్త ఆదాయ మార్గం  

ఒకప్పుడు సింగిల్‌గా అద్దెకుండే వారికి సింగిల్‌ రూమ్‌లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్‌ బెడ్‌రూమ్‌ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్‌ లేదా ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్‌ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్‌ లేదా షేర్డ్‌ రెంటల్‌ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ను మూడు బెడ్‌రూమ్‌లుగా విభజించి... కిచెన్, హాల్‌ వంటివి కామన్‌గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్‌ బెడ్‌రూమ్‌లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది.  

అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్‌ రెంటల్‌ హౌసింగ్‌ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్‌–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్‌తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. 

నాస్కామ్‌ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్‌ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్‌ బెడ్రూమ్‌ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్‌ జెడ్‌ వీటివైపు మొగ్గు చూపుతోంది.  

నిర్వహణ బాదరబందీ లేకుండా... 
ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్‌ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్‌ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్‌ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్‌స్పేస్‌ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది.  

లాభసాటి ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా... 
ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్‌ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్‌లో సాధారణ ట్రిపుల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్‌ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్‌ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. 

సంప్రదాయ రెంటల్‌ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్‌ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి.  

ఖాళీగా ఉండేది తక్కువే.. 
సాధారణంగా విద్యార్థులు, జూనియర్‌ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్‌ ప్రాపరీ్టలకు డిమాండ్‌ స్థిరంగా ఉంటోంది. వైజాగ్‌లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్‌ సంస్థల చెబుతున్నాయి.

రిస్క్ లు తెలుసుకోవాలి.. 
షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్‌లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్‌లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్‌ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్‌ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్‌ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement