వైరస్‌తో కలిసి సహజీవనం తప్పదు..

India risks economic hara-kiri if lockdown extended for much longer - Sakshi

ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్య

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం పాటు పొడిగించిన పక్షంలో దేశానికి ఆర్థికంగా.. ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు పొంచి ఉందని పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ వల్ల లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగినప్పటికీ.. పొడిగిస్తూ పోవడం వల్ల బడుగు వర్గాలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ‘టెస్టింగ్‌ పెరిగే కొద్దీ, కేసుల సంఖ్యపెరగడం కూడా సాధారణంగా జరిగేదే.    అయితే, లాక్‌డౌన్‌ను మరింత దీర్ఘకాలం పొడిగిస్తే మాత్రం ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు ఉంది. వైరస్‌తో కలిసి సహజీవనం చేయక తప్పదు’ అని ట్వీట్‌ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top