ఏఐ రోబోటిక్స్ అంకుర సంస్థ పర్సెప్టైన్ వచ్చే ఏడాది మరింతగా నిధులను సమీకరించడంపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే దేశీ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ. 30 కోట్లు సేకరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జగ్గరాజు నడింపల్లి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా చెప్పారు. ఇంటెల్ సీఈవో తదితరులు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న క్లయింట్లకు తగ్గట్లుగా ఉత్పత్తులను అందించే సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఆమ్ని, యునో, డ్యుయో అనే మూడు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరించారు. ఆటోమోటివ్, ఎల్రక్టానిక్స్ తదితర విభాగాల్లో తమకు క్లయింట్లు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏటా తొమ్మిది వేల పైచిలుకు రోబోలు దిగుమతవుతున్నాయని చెప్పారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దేశీయ పరిజ్ఞానంతో ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబోల తయారీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పైలట్ దశలో వందల స్థాయిలో ఉన్న ఉత్పత్తిని త్వరలో వార్షికంగా వెయ్యి రోబోల స్థాయికి పెంచుకోనున్నట్లు నడింపల్లి వివరించారు. ప్రస్తుతం సంస్థలో నలభై మంది వరకు సిబ్బంది ఉన్నారని చెప్పారు. రోబోటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, టెక్నీíÙయన్స్ మొదలైన విభాగాలవ్యాప్తంగా మరింత మందిని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.


