
ఐఐటీ–మద్రాస్‌లో చేసిన కాలేజీ ప్రాజెక్ట్ దివ్యాన్షు కుమార్‌ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. మాన్యువల్ స్కావెంజర్స్‌కు ప్రత్యామ్నాయంగా సెప్టిక్ ట్యాంక్స్, మ్యాన్‌హోల్స్‌ను శుభ్రపరిచే రోబోట్స్‌ను రూపొందించాడు. ప్రభుత్వం మాన్యువల్లీ క్లీనింగ్‌ను నిషేధించినప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట ఇది కొనసాగుతూనే ఉంది. 1993 నుంచి 2020 వరకు దాదాపు 928 మంది ట్రాకర్‌లు మరణించారు. తమిళనాడు, గుజరాత్‌లలో అత్యధిక మరణాలు సంభవించాయి.
బిహార్‌లోని గయకు చెందిన దివ్యాన్షు కుమార్ ‘సోలినస్ ఇంటిగ్రిటీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టాడు. మాన్యువల్లీ క్లీనింగ్‌కు ఈ స్టార్టప్ తయారుచేసే రోబోలు ప్రత్యామ్నాయంగా మారాయి. ఐఐటీ–మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన దివ్యాన్షు ప్రొడక్ట్ డిజైన్‌లో మాస్టర్స్ చేశాడు.
‘మాన్యువల్లీ క్లీనింగ్‌కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో మన దేశంలో వచ్చిన తొలి స్టార్టప్ మాది. తొలి దశలో సీడ్ ఫండింగ్ మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అంటున్నాడు దివ్యాన్షు. సెప్టిక్ ట్యాంక్‌లు, డ్రైనేజి క్లీనింగ్, వాటర్ పైప్‌లైన్‌ల క్లీనింగ్...మొదలైన వాటిపై ఈ స్టార్టప్ పనిచేస్తోంది. క్లౌడ్–బేస్డ్ స్టోరేజీ, డాటా మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్‌కు సంబంధించి ‘స్వస్థ్ ఏఐ’ అనే సర్వీస్‌ను కూడా ‘సోలినస్’ నిర్వహిస్తోంది.
(చదవండి: టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్)