జీఎస్‌టీఏటీని ప్రారంభించిన ఆర్థిక మంత్రి | Nirmala Sitharaman Launches GST Appellate Tribunal (GSTAT) | Faster GST Dispute Resolution | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీఏటీని ప్రారంభించిన ఆర్థిక మంత్రి

Sep 25 2025 9:05 AM | Updated on Sep 25 2025 11:25 AM

gstat launched by Finance Ministry GSTAT Tribunal Highlights

వ్యాపారవర్గాలు, ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ మధ్య వివాదాల సత్వర పరిష్కారానికి ఉపయోగపడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా జీఎస్‌టీ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (gstat)ని ప్రారంభించారు. వ్యాపార సంస్థలు ఈ పోర్టల్‌లో తమ కేసులను ఫైల్‌ చేయొచ్చు. 
డిసెంబర్‌ నుంచి వాటిపై విచారణ ప్రారంభమవుతుంది.

భారత్‌లో సంస్కరణలు పురోగమించే తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman.) చెప్పారు. మరింత మెరుగుపడాలన్న దృఢ సంకల్పాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి ఈ పోర్టల్‌ను ఉపయోగించుకోవాలని వ్యాపార సంఘాలకు ఆమె సూచించారు. అప్పీళ్ల ఫైలింగ్‌కి వ్యవధిని 2026 జూన్‌ 30 వరకు పొడిగించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!

జీఎస్టీఏటీ ట్రిబ్యునల్ ముఖ్యాంశాలు

  • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 24, 2025

  • పన్ను చెల్లింపుదారులు, అధికారుల మధ్య పెండింగ్‌లో ఉన్న 4.83 లక్షలకు పైగా జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం దీని ఉద్దేశం.

  • డిజిటల్ ఫైలింగ్ ద్వారా జీఎస్టీఏటీ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారులు అప్పీళ్లను దాఖలు చేయవచ్చు. కేసులను ట్రాక్ చేయవచ్చు. వర్చువల్ విచారణలకు హాజరు కావచ్చు.

  • దీని ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీలో ఉంటుంది.

  • దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement