గాలిలో తేలుతూ.. మెరుపుతీగలా వెళ్లే ట్రైన్! | Chinese Train Breaks World Record Hits 700 Kmph In 2 Seconds | Sakshi
Sakshi News home page

గాలిలో తేలుతూ.. మెరుపుతీగలా వెళ్లే ట్రైన్!

Dec 27 2025 4:02 PM | Updated on Dec 27 2025 4:20 PM

Chinese Train Breaks World Record Hits 700 Kmph In 2 Seconds

ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్న చైనా.. మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కి.మీ వేగవంతమయ్యే మాగ్లెవ్ (Maglev) రైలు ఈ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. చాలామంది ట్రైన్ రాకకోసం వేచి చూస్తున్నారు. అంతేలోనే మెరుపుతీగలా ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడున్నవారంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. చూడటానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా కనిపిస్తుంది.

అత్యంత వేగవంతమైన సూపర్‌కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలును విజయవంతంగా టెస్ట్ చేశారు. 700 కిమీ వేగంతో వెళ్లినప్పటికీ.. రైలును సురక్షితంగా స్టాప్ చేశారు. ఈ టెస్ట్ చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించారు.

మాగ్లెవ్ ట్రైన్స్.. సాధారణ పట్టాలపై నడవవు. బదులుగా ఇందులోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును ఎత్తి, పట్టాలను తాకకుండానే ముందుకు నెట్టివేస్తాయి. దీనివల్ల వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని భవిష్యత్తులో వాక్యూమ్ సీల్డ్ ట్యూబ్‌ల ద్వారా ప్రయాణించేలా చేయనున్నారు.

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చైనా యూనివర్సిటీ బృదం పదేళ్లుగా కృషి చేస్తున్నారు. 2025 జనవరిలో టెస్ట్ చేసినప్పుడు ఇది గంటకు 648 కి.మీ. గరిష్ట వేగాన్ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా జరిపిన టెస్టులో 700 కిమీ వరకు వేగవంతం అయింది. అదే యూనివర్సిటీ.. మూడు దశాబ్దాల క్రితం దేశంలో మొట్టమొదటి మనుషులతో కూడిన సింగిల్-బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement