
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు సీఎం చంద్రబాబుకు పట్టవని, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా నోరు మెదకపోవడమే ఇందుకు నిదర్శమన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్‌రెడ్డి. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఆల్మట్టి ఎత్తు పెరిగితే రాష్ట్రం ఎడారి కావడం ఖాయమన్నారు. ‘సాగునీరు, తాగునీరు దొరకని పరిస్థితి వస్తుంది. రాయసీమలో మరింత దుర్భిక్షం పెరుగుతుంది. -కర్ణాటక పనులకు సిద్ధం అవుతున్నా పట్టించుకోవడం లేదు. పొద్దుట లేచిన దగ్గర నుంచి ప్రచార ఆర్భాటాలే. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలి.
రాష్ట్రానికి ఆల్మట్టి శాపం చంద్రబాబు అసమర్థత ఫలితమే. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీరని విఘాతం. ఈ ప్రధాన సమస్యల నుంచి పక్కదోవ పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వ్యక్తిత్వ హననాలకు ఆద్యుడు చంద్రబాబే. అసెంబ్లీలో బాలకృష్ణ - చిరంజీవి ఎపిసోడ్‌కు స్ఫూర్తి చంద్రబాబే. తప్పు జరిగిందని భావిస్తే బాలకృష్ణ ఎందుకు క్షమాపణ చెప్పలేదు. లోకేష్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు. బాలకృష్ణది తప్పులేదంటూ ఎల్లో మీడియా ప్రసారాల వెనుక లోకేష్ లేరా?, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు వదిలేసింది. అన్నీ వర్గాల ప్రజల్లో అశాంతి నెలకొంది. ాసనసభలో జగన్‌ను తిట్టడం కోసం తప్ప ప్రజా ప్రయోజనాలపై చర్చ లేదు’ అని మండిపడ్డారు.
డిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి?
కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా పట్టించుకోవటం లేదు. దీనివల్ల 100 టీఎంసీల కృష్ణా జలాలు నష్టపోవాల్సి వస్తున్నా చీమ కుట్టినట్లైనా లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు నీళ్ళు ఆగిపోయే పరిస్థితి వస్తుందని తెలిసినా ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు..రైతులకు గిట్టుబాటు ధరలు లేక రోడ్లపైనే పారబోస్తున్నారు. దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ అన్నారు.. ఏమైంది. మీ డిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి?, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసెంబ్లీలో చర్చ జరిపారా?, అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు తప్ప ఇంకా ఏమైనా ఉన్నాయా?, కోడెల ఆత్మహత్యపై నిందారోపణలు చేస్తున్నారు.. ఫర్నిచర్ విషయంలో ఆరోపణల వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు అని అబద్ధాలు చెప్తున్నారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు అందరికీ తెలుసు..
మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవటంతో మేం కోర్టుకు వెళ్ళాం. అసెంబ్లీ ప్రసారాలు కూడా ఎవరూ వీక్షించటం లేదు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన చౌకబారు ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?, బాలకృష్ణ వ్యాఖ్యలు మీ పార్టీ అంతర్ముఖాన్ని చూపిస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.

అధికారం వచ్చే వరకూ మాత్రమే చిరంజీవి దేవుడు
లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు మీకు చెంపపెట్టు. ప్రాజెక్టులపై ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతున్నారు. అధికారం వచ్చే వరకు కాపు కమ్యూనిటీ కోసం చిరంజీవి దేవుడు. ఇప్పుడు బాలకృష్ణ మాటలకు భయపడి పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు.మీరు అధికారంలోకి వచ్చారంటే అది పవన్ పుణ్యమే. ప్రతినెల ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వటానికి వెళ్తున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?, ఆల్మట్టి విషయంలో ప్రభుత్వం పట్టించుకోకుంటే మేమే కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం’అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
అనిత ‘గాలి’ మాటలు.. మళ్లీ రోడ్డెక్కిన మత్స్యకారులు