
తాడేపల్లి : సినిమా ఫంక్షన్‌లకు వెళ్లినట్లు అసెంబ్లీకి కూడా అలానే వెళ్లారా? అని ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణను ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బాలకృష్ణ మానసిక స్థితిపై తమకు అనుమానం ఉందన్నారు భరత్. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన భరత్.. ‘ అసెంబ్లీలో బాలకృష్ణ మాట తీరు.. వ్యవహార శైలి దారుణంగా ఉంది. నెత్తి మీద విగ్గు, దానిమీద గాగుల్స్, జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడతారా?, మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారు.
ఆయన మాట తడపడుతూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికి 86 మందిని అరెస్టు చేశారు. తారక్ అనే సోషల్ మీడియా కార్యకర్త మీద దోపిడీ దొంగలు, కిడ్నాపర్ల మీద పెట్టే కేసులు పెట్టారు. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వానికి బుద్ది రాలేదు
రాజమండ్రికి చెందిన పులి సాగర్ అనే ఎస్సీ యువకుడిని అర్దనగ్నంగా లాకప్‌లో పెట్టి వేధించారు. ఎస్సీ కమిషన్ సీరియస్ అయి నోటీసులు కూడా ఇచ్చింది. సీసీ కెమెరా పుటేజీ అడిగితే కెమెరాలు పని చేయటం లేదని అధికారులు అబద్దాలు చెప్పారు. పోలీసులను టీడీపీ నేతల కోసం వాడుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ ఏకంగా పోలీసులపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు.

అసెంబ్లీ వేదికగా జగన్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌లు మండిపడ్డారు. నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు పెట్టుకుంటే సరిపోదని, ఒంటికి కొంచెం సిగ్గు అనేది ఉండాలని విమర్శించారు గుడివాడ అమర్నాథ్ ప్రపంచంలోనే బాలకృష్ణ అతిపెద్ద సైకో అని, కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తానన్నారు అంబటి రాంబాబు.