
అమరావతి : మండలి చైర్మన్ సీటులో దళితుడు కూర్చున్నాడని అవమానించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు అందించాలన్నారు బొత్స. శాసనమండలి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద బొత్స మాట్లాడారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు వినడానికి సిగ్గుపడుతున్నామని, చట్ట సభల్లో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.
‘బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మొత్తం రికార్డుల్లో ఉంది. ఆయన మూమూలుగా ఉన్నాడా?, ఒక మాజీ సీఎంని, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరోని అవమానించడం సరికాదు. సభలో లోకేష్ మమ్మల్ని ఎవరేం పీకుతారు అన్నారు వాళ్ళ వ్యవహారశైలి అలాగే ఉంది.
మాజీ ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదు. సినీ పరిశ్రమకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అన్న గౌరవం లేదు. బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారు. ఏం చూసి మీ అహంభావం. వాళ్ళ పార్టీ నుంచి ఇంతవరకు వివరణ లేదు. స్పీకర్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతాడు.. ఎందుకు స్పందించలేదు. ఒక మాజీ సీఎం, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని అవమానిస్తే పట్టించుకోరా?, మేం కేవలం సభా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాం. చిరంజీవికి అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదనేది మాకు అనవసరం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని బొత్స పేర్కొన్నారు.
