
హైదరాబాద్: హైదరాబాద్ నగర కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు.

మంగళవారం ఉదయం కమాండో అండ్ కంట్రోల్ యూనిట్‌లో సీవీ ఆనంద్ నుండి సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు.

ఆర్టీసీ ఎండీ ఉన్న ఆయన్ని ప్రభుత్వం సీపీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు డ్యూటీలో భాగంగా ఆయన సాధారణ పౌరుడిలా బస్సులో ప్రయాణించడం నెట్టింట వైరల్ అయ్యింది.

వీసీ సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో సైబరాబాద్ కమిషనర్‌గా పని చేశారు.










