
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు అక్రమార్జన కోసం చేసే ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని.. కల్తీ మద్యం పరిశ్రమే బయటపడిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కూటమి నేతలు చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ? అంటూ నిలదీశారు.
అక్టోబర్ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్నారు. భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా.?. గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిదంటూ అనేక మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. అధికార దుర్వినియోగపరుస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ఆరోపణల్లో నిజముంటే కోర్టులో ఆధారాలు ఎందుకు చూపించలేదు?. మూలకల చెరువులో కల్తీ మద్యం డంప్ దొరికితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. రోజుకి 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారు చేసే డంప్ దొరికితే ఏం చేస్తున్నారు?’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు.