Apr 9 2026 8:07 AM | Updated on Apr 9 2026 12:43 PM
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు ఎగసిపడుతుండగా మంటలు పక్కనున్న యూనిట్లకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.