హైదరాబాద్:నగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్,పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర చోట్ల వర్షం పడుతోంది.

ఎల్‌నినో ప్రభావంతో ఇంకా వేసవి ఛాయలే కనిపిస్తూ ఉండటంతో వర్షాల కోసం జనం ఎదురుచూస్తున్నారు. వర్షాకాలం వచ్చింది కానీ ఇంకా సరైన వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటు నగరంలో ఉండే వారు వర్షాలు కురిస్తే వేసవిలో ఆగిపోయిన నీటి బోర్లు.. తిరిగి గాడిన పడతాయని ఆశిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యధిక శాతం వాటర్ టాంకర్లపై ఆధాపడుతూ ఉన్న నేపథ్యంలో వర్షం పడితే అంతా సెట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ తరుణంలో కొన్ని రోజులుగా చెదురుమదురు జల్లులు నగర వాసులకు ఊరటనిస్తున్నాయి.

మరొకవైపు జూలైలో కొంత మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతాన్ని మేఘాలు కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉండటం ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.


