Hyd: వాహనదారులకు అలర్ట్‌.. 2 రోజులు ట్రాఫిక్‌ మళ్లింపులు | Traffic diversions Hyderabad Balkampet Yellamma Kalyanam | Sakshi
Sakshi News home page

Hyd: వాహనదారులకు అలర్ట్‌.. 2 రోజులు ట్రాఫిక్‌ మళ్లింపులు

Jul 20 2026 5:52 PM | Updated on Jul 20 2026 7:37 PM

Traffic diversions Hyderabad Balkampet Yellamma Kalyanam

హైదరాబాద్‌: బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో మంగళవారం (జులై 21), బుధవారం (జులై 22) నిర్వహించనున్న అమ్మవారి కల్యాణం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ఈ కల్యాణోత్సవం, రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. 

దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పెరిగే అవకాశం ఉండడంతో, బల్కంపేట పరిసర ప్రాంతాలలో మోస్తరు ట్రాఫిక్ నిలిచిపోయే (జామ్ అయ్యే) అవకాశం ఉంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే రహదారులను నియంత్రించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

జులై 21-22 తేదీల్లో ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు

  •  గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఫతేనగర్ ఫ్లైఓవర్, ఫతేనగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్సార్‌ నగర్ ‘T’ జంక్షన్ వద్ద ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్ - అభిలాష టవర్స్ – బి.కె గూడ ఎక్స్ రోడ్ - శ్రీరామ్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి సనత్‌నగర్ / ఫతేనగర్ రోడ్ వైపు మళ్లిస్తారు.

  • ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను న్యూ బ్రిడ్జి (హైదరాబాద్ కిచెన్ మార్ట్) వద్ద RUB ద్వారా కట్టమైసమ్మ ఆలయం - బేగంపేట వైపు మళ్లిస్తారు.

  • గ్రీన్ ల్యాండ్స్ - బకుల్ అపార్ట్‌మెంట్స్ - ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. వీటిని ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి టెంపుల్ - సత్యం థియేటర్ - మైత్రీవనం / ఎస్సార్‌ నగర్ ‘T’ జంక్షన్ వైపు మళ్లిస్తారు.

  • బేగంపేట, కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపేట ఆలయానికి వెళ్లే ట్రాఫిక్‌ను అనుమతించరు. వీటిని బేగంపేట ఫ్లైఓవర్ - మాతా టెంపుల్ – సత్యం థియేటర్ – మైత్రీవనం ద్వారా గ్రీన్ ల్యాండ్స్ వైపు అనుమతిస్తారు.

  • ఎస్సార్‌ నగర్ ‘T’ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న బై-లేన్స్‌, లింక్ రోడ్లను మూసివేస్తారు.

భక్తుల పార్కింగ్ స్థలాలు
1.    R & B ఆఫీస్
2.    GHMC గ్రౌండ్
3.    పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్, డీకే రోడ్ నుండి నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్
4.    ఫతేనగర్ అండర్ బ్రిడ్జి
5.    నేచర్ క్యూర్ హాస్పిటల్
6.    GHMC ప్లే గ్రౌండ్, సనత్‌నగర్

ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement