మొట్టమొదటి డైనోసార్‌ లెదర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌..! ధర ఎంతో తెలుసా.. | Worlds First 'Dinosaur Leather Handbag | Sakshi
Sakshi News home page

మొట్టమొదటి డైనోసార్‌ లెదర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌..! ధర ఎంతో తెలుసా..

Apr 8 2026 1:09 PM | Updated on Apr 8 2026 3:35 PM

Worlds First 'Dinosaur Leather Handbag

డైనోసార్లు 66 మిలియన్‌ సంత్సరాల క్రితమే అంతరించిపోయాయి కదా మరి దాని తోలుతో హ్యాండ్‌ బ్యాగ్‌ ఎలా సాధ్యం. బతికే ఉన్న జంతవుల తోలు నుంచి తయారు చేశారంటే అవునా అని అనొచ్చుగానీ, అస్సలు భూమ్మీద మనుగడ లేని ఆ జంతువుల తోలుతో చేసిన లేదర్‌  వ్యాండ్‌ బ్యాగ్‌ ఏంటి అని సందేహించకండి. ఎందుకంటే ఇది ముమ్మాటికి డైనోసార్‌ లెదర్‌ హ్యాండ్‌ బ్యాగే. దాని ధర తెలిస్తే విస్తుపోతారు. అసలు దీన్నెలా రూపొందించారు, ఎందుకంత ఖరీదు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

ఒక ప్రాజెక్టులో భాగంగా నెదర్లాండ్‌ శాస్త్రవేత్తలు, డిజైనర్లు టైరన్నోసారస్ రెక్స్ శిలాజాలల(డైనోసార్‌ శిలాజాలు) నుంచి సేకరించిన కొల్లాజెన్‌ను ఇతర జంతువుల కణాలతో కలిపి ల్యాబ్‌లో కృత్రిమంగా పెంచారు. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం మూడు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ది ఆర్గానాయిడ్ కంపెనీ, జెనోమిక్ ఇంజనీరింగ్ సంస్థ ఆర్గానాయిడ్,  క్రియేటివ్ ఏజెన్సీ VML అనే మూడు కంపెనీలు 2023లో ఉన్ని మామత్ DNAను గొర్రెల కణాలతో కలిపి ఒక భారీ మీట్‌బాల్‌ను తయారు చేసేందుకు పనిచేశాయి. 

మళ్లీ తాజాగా ఈ బృందం డైనోసార్ అవశేషాల నుంచి పురాతన ప్రోటీన్ శకలాలను సేకరించి, వాటిని ఒక గుర్తుతెలియని జంతువు కణాలలోకి ప్రవేశపెట్టి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత దానిని తోలుగా మార్చారు. అయితే చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేయడంతో..డచ్ శిలాజ శాస్త్రవేత్త ఇలా వివరణ ఇస్తూ.. వారి అనుమానాలను పటాపంచలు చేశారు. 

డైనోసార్ ఎముకలలో కొల్లాజెన్ కేవలం శకలాల రూపంలో మాత్రమే మిగిలి ఉంటుందని, దానిని ఉపయోగించి టి-రెక్స్ చర్మాన్ని పునఃసృష్టించలేమని అన్నారు. అలాగే సరిపోలిన ప్రోటీన్లలో కూడా, నిజమైన జంతు తోలుకు దాని విశిష్ట లక్షణాలను ఇచ్చే ఫైబర్ నిర్మాణం లోపిస్తుందని చెప్పారు. సరికొత్త ప్రయోగం చేసేటప్పుడే ఇలాంటి సందేహాలు మాములేనని, అయినా ఇంతవరకు డైనోసార్‌ చర్మం అనేలా ఎవ్వరూ అంత స్థాయిలో ప్రయోగం చేయలేకపోయారని కూడా అన్నారు. 

అదీగాక సంప్రదాయ లెదర్ బ్యాగ్లతో పోలిస్తే, ల్యాబ్ తో చేసిన టి. రెక్స్ లెదర్‌ అత్యంత విలాసవంతమైన వస్తువుగా నిలుస్తుందన్నారు. ఈ డైనోసర్‌ లెదర్‌ బ్యాగ్‌ని మే 11న ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఆర్ట్ జూ మ్యూజియంలో  సందర్శనకు ఉంచనున్నారట. అంతేగాదు దీన్ని వేలం వేయనున్నట్లు సమాచారం. పైగా దీని ప్రారంభ ధరే రూ. 4 కోట్లు అని చెబుతున్నారు పరిశోధకులు.

(చదవండి: Kerala Techie: సాహసమా..? నాటకమా..?: కావాలనే చేసిందా ఆ టెకీ..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement