సాక్షి, ఢిల్లీ: అమెరికా ఇరాన్ కాల్పుల విరమణపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతి కోసం ఆశిస్తున్నామంటూ భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం పరంగా శాంతిని నెలకొల్పాలని గతంలోని చెప్పాం. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగింది. హోర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా నౌకలు వెళ్తాయని ఆశిస్తున్నాము’’ అని భారత విదేశాంగ పేర్కొంది.
కాగా, ‘‘ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు... ఇరాన్ కూడా శాంతినే కోరుకుంటోంది. ఇక యుద్ధాన్ని కొనసాగించాలనుకోవడం లేదు. అలాగే, అందరికీ కూడా ఇలాగే అనిపిస్తోంది’’ అంటూ అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ పెరుగుదల విషయంలో అమెరికా సాయం చేస్తుందన్న ట్రంప్.. పాజిటివ్ చర్యలు ఎక్కువగా ఉంటాయన్నారు.
ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సరఫరాలతో లోడ్ అవుతాము. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండబోతున్నాం. అది జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అమెరికాలో మేము అనుభవిస్తున్నట్లే, ఇది పశ్చిమాసియాకు స్వర్ణ యుగం కావచ్చు” అని ట్రంప్ పేర్కొన్నారు.
Statement on the recent development in West Asia ⬇️
🔗 https://t.co/WwFCi4kXHg pic.twitter.com/wmsF4YUb7j— Randhir Jaiswal (@MEAIndia) April 8, 2026


