ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరికలు | Centre Issues Fresh Advisory For Iran Indian Citizens | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరికలు

Apr 8 2026 12:11 PM | Updated on Apr 8 2026 12:41 PM

Centre Issues Fresh Advisory For Iran Indian Citizens

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్‌లోని భారతీయుల కోసం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలంటూ బుధవారం మరో ప్రకటన విడుదల చేసింది. 

వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్‌ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. అయితే ఇండియన్‌ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని.. ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదంటూ అందులో కీలక సూచన చేసింది. 

మరిన్ని వివరాల కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెబుతూ.. +989128109115; +989128109109; +989128109102; +989932179359 హెల్ప్‌లైన్‌ నెంబర్లతో పాటు cons.tehran@mea.gov.in మెయిల్‌ ఐడీని సంప్రదించాలని తెలిపింది. 

రెండు వారాల యుద్ధ విరమణ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లు స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఇరాన్‌లోని భారతీయుల క్షేమసమాచారాలను కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement