BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు! | BMW Hires 19Year-Old Without Degree Viral LinkedIn Post Sparks Debate On Personal Branding | Sakshi
Sakshi News home page

BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

Apr 8 2026 2:42 PM | Updated on Apr 8 2026 3:03 PM

BMW Hires 19Year-Old Without Degree Viral LinkedIn Post Sparks Debate On Personal Branding

బీఎండబ్ల్యూ (BMW) వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల యువతి డిగ్రీ లేకుండానే ఉద్యోగం సాధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ రోల్ సాధించాలంటే కనీసం డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ, గౌరీ ఎమ్ అనే 19 ఏళ్ల కంటెంట్ క్రియేటర్  ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేకుండానే, డిజిటల్‌ స్పేస్‌లో ఆమెకున్న పర్సనల్ బ్రాండింగ్ పవర్‌ కారణంగా ఆ సంస్థలో పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది.  పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఎలాంటి డిగ్రీ లేకుండానే ప్రపంచంలోనే ప్రీమియం కార్లు, మోటార్‌సైకిళ్లను ప్రతిష్టాత్మక కంపెనీ బీఎండబ్ల్యూలో ఉద్యోగం సంపాదించిందంటూ ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. అకడమిక్ అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం బలమైన వ్యక్తిగత బ్రాండ్‌ను, సోషల్ మీడియా ఉనికి ద్వారా కంటెంట్ క్రియేటర్ గౌరీ ఎం పూర్తికాల పర్సనల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వివిధ ప్లాట్‌ఫామ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లింక్డ్‌ఇన్‌లో 65,000 మందికి పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 35 వేల మందికి పైగా ఉన్నారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.పైగా ఆమె ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకోలేదు, కనీసం కోల్డ్ ఈమెయిల్స్ కూడా పంపలేదు. ఆమె కంటెంట్ చూసి కంపెనీ ప్రతినిధులే స్వయంగా ఆమెను సంప్రదించడం విశేషం.

"నేను కేవలం 19 ఏళ్ల అమ్మాయిని, నాకున్న వనరులతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ నన్ను గుర్తించి ఉద్యోగం ఆఫర్ చేయడం నమ్మలేకపోతున్నాను" అని ఆమె లింక్డ్‌ఇన్‌లో  పోస్ట్‌లో వెల్లడించింది.

నెటిజన్ల స్పందన  
ఈ విషయంలో నెటిజన్లు రెండు రకాలుగా  స్పందించారు. ప్రస్తుతకాలంలో కేవలం డిగ్రీల కంటే నైపుణ్యం (Skills) , పర్సనల్ బ్రాండింగ్ ముఖ్యమని, సోషల్ మీడియాను కెరీర్ ఎదుగుదలకు ఎలా వాడుకోవాలో గౌరీ నిరూపించిందని కొందరు ప్రశంసించారు. మరోవైపు ఇలాంటివి అరుదుగా జరుగుతాయి, అన్ని రంగాల్లో డిగ్రీ లేకుండా ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు అంటూ ఉద్యోగార్థులను హెచ్చరించారు.  సంప్రదాయ విద్యా విధానం ప్రాముఖ్యతను తక్కువ చేయకూడదని  సూచించడం గమనార్హం.

ఇదీ చదవండి: షార్ట్‌కట్‌ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి

Advertisement
 
Advertisement
Advertisement