హ్యాండ్‌ బ్రేక్‌ : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం | IndiGo plane grounded after catering SUV rams into engine at Kolkata Airport | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌ బ్రేక్‌ : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Apr 8 2026 12:59 PM | Updated on Apr 8 2026 1:13 PM

IndiGo plane grounded after catering SUV rams into engine at Kolkata Airport

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఇండిగో విమానానికి ప్రమాదం జరిగింది. పార్కింగ్ బేలో ఉన్న విమానాన్ని డ్రైవర్ లేని ఒక వాహనం (SUV) వచ్చి ఢీకొట్టింది.అయితే  ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో  అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, మంగళవారం కోల్‌కతా విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌బస్ A320 (ఫ్లైట్ 6E 6663) విమానాన్ని ఒక క్యాటరింగ్ ట్రక్కు ఇండిగో విమానాన్ని ఢీకొట్టడంతో, ఆ విమానానికి స్వల్ప నష్టం వాటిల్లింది.ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానం విమానాశ్రయ టార్మాక్‌పై నిలిపి ఉంది. వాహనంలో మనుషులు లేనప్పటికీ  ఇది ముందుకు వచ్చి  విమానాన్ని ఢీకొట్టిందని ఇండిగో ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ  విమానం కోల్‌కతా నుంచి గౌహతికి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో విమానాన్ని కార్యకలాపాలకు తిరిగి అనుమతించే ముందు, క్షుణ్ణమైన తనిఖీలు , అవసరమైన నిర్వహణ  నిమిత్తం తాత్కాలికంగా దీన్ని నిలిపివేశారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో సంస్థ గౌహతి వెళ్లడానికి వేరే విమానాన్ని ఏర్పాటు చేసింది.

అయితే ఈ వాహనానికి డ్రైవర్ హ్యాండ్‌బ్రేక్ వేయకుండా దిగిపోయాడు. దీనివల్ల ఆ వాహనం దానంతట అదే కదులుతూ వెళ్లి విమానం కుడి ఇంజిన్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు గానీ, సిబ్బంది గానీ లేరు. కాబట్టి ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ భద్రతపై ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిబంధనల ప్రకారం భద్రతా ప్రోటోకాల్స్ పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement