కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! | Nita Ambani visited Maa Kamakhya Temple in Guwahati | Sakshi
Sakshi News home page

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..

Apr 8 2026 4:18 PM | Updated on Apr 8 2026 4:36 PM

Nita Ambani visited Maa Kamakhya Temple in Guwahati

రిలయ‍న్స్‌ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ సందర్భానికి తగ్గట్టు స్టైలిష్‌ రెడీ అవ్వడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా హస్తకళలు, భారతీయ సంప్రదాయ వారసత్వ విలువ తెలిపేలా నీతా అలంకరణ ఉంటుంది. తాజాగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్‌తో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి విశేష పూజలు చేసి, ఆమె ఆవీర్వాదం కోరారామె. 

ఆలయ దర్శనం కోసం నీతా గులాబీ రంగులోని కుర్తాతో ఎంతో హుందాగా వచ్చారామె. పొడవాటి చేతులతో చుట్టు దుప్పటా దానిపై బంగారు ఎంబ్రాయిడరీ ఆమె లుక్‌ని మరింత హైలెట్‌ అ‍య్యేలా చేసింది. దానికి బంగారు బ్రోకేడ్‌తో అంచు ఎంబ్రాయిడరీ చేయబడిన స్ట్రెయిట్-ఫిట్ ప్యాంటుతో జత చేసింది. 

అందుకు తగ్గట్టుగా వదులుగా జుట్టుని వదిలేసి, చక్కటి పాపిడి బొట్టుతో సంప్రదాయంతో మిళితమైన ఆధునిక మహిళలా తళుక్కుమంది. సరళమైన సంప్రదాయ దుస్తులకు అనుగుణంగా మల్టీ-క్యారెట్ కాక్‌టెయిల్ రింగ్, స్టేట్‌మెంట్ డైమండ్ చెవిపోగులు ధరించారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఆలయం విశిష్టత..
మా కామాఖ్య, లేదా కామేశ్వరి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. ఈ ఆలయం గౌహతిలో ఉంది. భూమిపై ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది అత్యంత పవిత్రమైనది, పురాతనమైనది కూడా

తన భద్రతా సిబ్బందితో కలిసి వచ్చిన నీతా అంబానీ, ఈ ఆలయాన్ని సందర్శించి, పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు.  ఆమె అమ్మవారికి ప్రార్థనలు చేయడం, పూజారులతో మాట్లాడటం, పూజలు నిర్వహించడం, ఆలయంలో ఉన్న భక్తులను పలకరించడం వీడియలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 

 

(చదవండి: మొట్టమొదటి డైనోసార్‌ లెదర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌..! ధర ఎంతో తెలుసా..)
 

Advertisement
 
Advertisement
Advertisement