క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్‌ ఏంటో ? | Co owner of MI IPL franchise Nita Ambani's special mudra | Sakshi
Sakshi News home page

IPL 2026 నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్‌ ఏంటో ?

Mar 28 2026 6:19 PM | Updated on Mar 28 2026 7:20 PM

Co owner of MI IPL franchise Nita Ambani's special mudra

ఐపీఎల్‌  2026 (IPL-2026) సీజన్  ప్రారంభమైంది.  బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్‌తో మొదలుకానుంది.  మార్చి 28 నుండి మే 31  వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. మొత్తం మొత్తం 84 మ్యాచ్‌లతో   10 జట్ల తలపడతాయి.  ఈ సీజన్‌ ఫైనల్ బెంగళూరులో జరగనుంది.

అయితే ఐపీఎల్‌ జట్లలో ప్రదానమైంది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). ఆర్సీబీ జట్టు కో-ఓనర్‌ నీతా అంబానీకి సంబంధించి ఒక ఆసక్తికర సంగతి నెట్టింట  వైరల్‌గా మారింది.


నీతా అంబానీ ముద్ర స్పెషల్‌ 
ముఖ్యమైన కార్యక్రమాలకు,మరీ ముఖ్యంగా ఐపీఎల్‌ స్పెషల్‌ ఈవెంట్లకు ముందు నీతా అంబానీ సూక్ష్మ హస్త ముద్రలు వేయడం విశేషంగా నిలుస్తోంది. ఇది అంగ న్యాసను ప్రతిబింబిస్తుందని విశ్వాసం. మనస్సును కేంద్రీకరించి, అంతర్గత శక్తిని సమతుల్యం చేయడానికి ఉద్దేశించిన ప్రాచీన వేద పద్ధతి అని పండితుల మాట.  60 సెకన్ల పాటు ఇలా చేస్తే మనసుకు ప్రశాంతత, శక్తిని లభిస్తుందట. క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్‌ ఏంటో?

ఎలా చేయాలి?
ప్రశాంతంగా కూర్చోండి (వీలైతే తూర్పు వైపు ముఖం పెట్టి) మూడుసార్లు లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత పూర్తి ఏకాగ్రతతతో “ఓం నమః శివాయ” లేదా మీ ఇష్ట దేవతా మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత శరీర భాగాను సున్నితంగా స్పృశించాలి.

శిరస్సు – స్పష్టత
కళ్ళు – ఏకాగ్రత
హృదయం – భావోద్వేగాల సమతుల్యత
నాభి – అంతర్గత శక్తిని ఉత్తేజం
పాదాలు – భూమిపై నిలదొక్కుకున్న అనుభూతి

చివరగా ఒక క్షణం మౌనం పాటించి, శ్వాసమీద ధ్యాసపెట్టి  ఆలోచనలను ఆలోచనలను గమనించాలి ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement