NMACC : కళాకారులపై గౌరవాన్ని చాటుకున్న నీతా | NMACC 3rd anniversary Nita Ambani honoured the extraordinary artists | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంఏసీసీ ఈవెంట్‌లో గౌరవాన్ని చాటుకున్న నీతా

Apr 7 2026 6:08 PM | Updated on Apr 7 2026 6:48 PM

NMACC 3rd anniversary Nita Ambani honoured the extraordinary artists

NMACC 3rd Anniversary  నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌  నీతా అంబానీ  (Nita Ambani)    వివిధ రంగాల్లో నిష్టాతులైన కళకళారుల  పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు.  భారతదేశ స్ఫూర్తికి జీవం పోసిన ప్రముఖ కళాకారులను నీతా అంబానీ సత్కరించారు.


NMACC స్టూడియో థియేటర్ ది గ్రాండ్ థియేటర్‌లో జరిగిన 'ఏక్ సుర్ – భారత్ కీ ఆవాజ్' కార్యక్రమంలో, దిగ్గజ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్,  ప్రముఖ గాయని  శ్రేయా ఘోషల్, రాజస్థానీ జానపద దిగ్గజం మామే ఖాన్, గుజరాత్ ప్రసిద్ధ ద్వయం ఉస్మాన్ మీర్ & అమీర్ మీర్, తాళ వాయిద్య మేధావి ఓజస్ అధియా తమ కళ ద్వారా ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు.  వారి అద్భుతమైన సేవలకు గుర్తింపుగా నీతా అంబానీ వారిని ఘనంగా సత్కరించారు.  

వీరితోపాటు ప్రముఖ ప్రదర్శకుడు శేఖర్ సుమన్, ప్రసిద్ధ భక్తి సంగీత విద్వాంసుడు అగమ్ అగర్వాల్, సితార్ విద్వాంసుడు స్వయం సిద్ధ ప్రియదర్శి,  భరతనాట్య దిగ్గజం రాధే జగ్గీలను కూడా సత్కరించడం విశేషం.

ఇదీ చదవండి: దుబాయ్‌లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్‌ బిలియనీర్‌ స్టోరీ

Advertisement
 
Advertisement
Advertisement