దుబాయ్‌లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్‌ బిలియనీర్‌ స్టోరీ | Crores Value Company Sold For Rs 74, Most Shocking Corporate Collapse In History, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్‌ బిలియనీర్‌ స్టోరీ

Apr 7 2026 4:46 PM | Updated on Apr 7 2026 6:13 PM

Crores value Company Sold for Rs 74 Most shocking corporate collapse in history

బీఆర్‌ శెట్టి (B.R. Shetty)    జీవితంలో సేల్స్‌మేన్‌ నుంచి బిజినెస్‌టైకూన్‌గా ఎదిగి, తిరిగి అదేస్థాయిలో పతనమైన, ఉత్థాన పతనాల గురించి తెలుసుకుంటే  కాబోయే వ్యాపారవేత్తలకు సత్యం బోధపడుతుంది. ఒకప్పుడు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో అంతస్తులు, ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్‌లతో దుబాయ్‌లో టాప్‌ బిలియనీర్‌గా  ఒక వెలుగు వెలిగిన బీఆర్‌ శెట్టి ( బావగుత్తు రఘురాం శెట్టి)  వ్యాపార సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలిందో తెలుసా?  చివరికి రూ. 12400 కోట్ల కంపెనీని కేవలం రూ. 74కి విక్రయించే స్థాయికి  పడిపోవడానికి దారిన వినాశనం ఎలాంటిది? తెలుసుకుందాం.

1973లో ఖాళీ చేతులతో యూఏఈ (UAE) వెళ్లిన శెట్టి, అక్కడ తొలి రోజుల్లొ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. 1975లో తన భార్య ఏకైక డాక్టర్‌గా ఒక చిన్న క్లినిక్‌ను ఎన్.ఎమ్.సి (NMC)ని  ప్రారంభించారు. అది  అంచెలంచెలుగా  ఎదిగి తర్వాత ప్రపంచవ్యాప్త హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌గా ఎదిగింది. హెల్త్‌కేర్‌తో పాటు ఫిైనాన్స్ (UAE Exchange), ఫార్మాస్యూటికల్స్ (Neopharma),ట్రావెలెక్స్ (Travelex) వంటి సంస్థలను ఏర్పాటు చేసి  దృఢ సంకల్పంతో, ధైర్యంతో తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్లాడు.  రూ. 207 కోట్ల విలువైన దుబాయ్  ఐకానిక్ బుర్జ్ ఖలీఫాలో మొత్తం రెండు అంతస్తుల నివాసంలో ఉండేవాడు. ఇవేనా వరల్డ్ ట్రేడ్ సెంటర్, పామ్ జుమేరాలో ఆస్తులు ఉండేవి. ఖరీదైన రోల్స్ రాయిస్, మేబ్యాక్ కార్లతో సహా విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. 34 కోట్లకు కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్‌లో 50 శాతం వాటాను  కూడా ఉండేది 2012లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన  తొలి యూఏఈ కంపెనీగా NMC నిలిచింది. శెట్టి వ్యక్తిగత ఆస్తి సుమారు 4 బిలియన్లకు డాలర్లు చేరుకుంది.

పతనం ఎలా మొదలైంది 
2019లో, షార్ట్-సెల్లర్ కార్సన్ బ్లాక్ నేతృత్వంలోని UK ఆధారిత పెట్టుబడి పరిశోధన సంస్థ  ముడీ  వాటర్స్, తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపించింది. అప్పులను తక్కువగా చూపించడానికి నగదు ప్రవాహాన్ని పెంచిందని ఆరోపిస్తూ ఒక ట్వీట్‌ చేయడంతో శెట్టి సామ్రాజ్యం పతనమైంది.

2020 ప్రారంభంలో, సుమారు దాదాపు రూ.33,000 కోట్ల అప్పును కంపెనీ  ప్రకటించకుండా దాచిపెట్టిందని తేలింది.  ఈ  క్రమంలోనే ఫోర్జరీ పత్రాలు, అనధికారిక రుణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బ్రిటన్ హైకోర్టు NMC ని అడ్మినిస్ట్రేషన్‌లోకి తీసుకుంది. శెట్టి ఆస్తులను సీజ్‌ చేశారు.  2025, అక్టోబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) వ్యక్తిగత గ్యారెంటీ కింద 46 మిలియన్ల డాలర్లు చెల్లించాలని దుబాయ్ కోర్టు శెట్టిని ఆదేశించింది. భారీగా అప్పులు, ఆర్థిక అస్థిరతతో, శెట్టి తన రూ. 12,478 కోట్ల  ఎన్‌ఎంసి హెల్త్‌ను కేవలం రూ. 74కి ఇజ్రాయెల్-యుఎఇ కన్సార్టియమ్‌కు విక్రయించవలసి వచ్చింది.

ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

ఆశయం ఎంత గొప్పదైనా, పారదర్శకత  ప్రాధాన్యంగా ఉండాలి. వ్యాపార వృద్ధి కంటే నిజాయితీతో,  విశ్వాసాన్ని నిలబెట్టు కోవడం ముఖ్యం. అలాగే కార్పొరేట్ పాలన  ముఖ్యం అని  బీఆర్‌  శెట్టి ఉదంతం నిరూపిస్తోంది.   ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడిన ఆయన జీవితం భవిష్యత్‌ వ్యాపారవేత్తలకు ఒక గుణపాఠం.

ఇదీ చదవండి: రనౌట్‌ వివాదం : అంపైర్‌ను పొడిచి చంపేశాడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement