ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్ ధీర్(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, సందీప్ శర్మ, బర్గర్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది.
ముంబై ఏడో వికెట్ డౌన్
నమన్ ధీర్ రూపంలో ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ కోల్పోయింది.
ముంబై ఆరో వికెట్ డౌన్
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రూథర్‌ఫోర్డ్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ముంబై స్కోర్: 94/6
కష్టాల్లో ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. రవిబిష్ణోయ్ వేసిన ఐదో ఓవర్‌లో మూడో బంతికిక్ పాండ్యా(9), ఆఖరి బంతికి తిలక్ వర్మ(1) ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్
రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సందీప్ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్
151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 8 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
ముంబై ముందు భారీ టార్గెట్
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.
రాజస్తాన్ మూడో వికెట్ డౌన్
రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/2.
రాజస్తాన్ రెండో వికెట్ డౌన్
84 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన ధ్రువ్ జురెల్.. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 7 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/2. జైశ్వాల్(47), రియాన్ పరాగ్(7) క్రీజులో ఉన్నారు.
రాజస్తాన్ తొలి వికెట్ డౌన్
80 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రాయల్స్ ఓపెనర్ల విధ్వంసం
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(10 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ(7 బంతుల్లో20) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.
ఒకే ఓవర్‌లో 22 పరుగులు
రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో జైశ్వాల్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు.
మ్యాచ్ ఆరంభం
ఈ వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులోకి వచ్చారు. రాజస్తాన్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
మరి కాసేపట్లో మ్యాచ్ ఆరంభం
👉వర్షం కారణంగా రాజస్తాన్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. 9:55కు టాస్ పడనుండగా.. 10:10 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
తగ్గిన వర్షం
అభిమానులకు గుడ్ న్యూస్. గౌహతిలో వర్షం ఎట్టకేలకు ఆగింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
టాస్ ఆలస్యం
ఐపీఎల్-2026లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్- ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. గౌహతిలో ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఇప్పుడు ఆలస్యం కానుంది. కాగా సోమవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది.


