ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఒక మహిళ ఎదుర్కొన్న కట్న వేధింపుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని రేపుతోంది. పెళ్లి సమయంలో భర్త అనారోగ్యాన్ని దాచి పెట్టడమే కాకుండా, భార్యను కిడ్నీ ఇస్తావా, రూ. 30 లక్షలు తెస్తావా అంటూ వేధించిన కథనం తాజాగా వైరల్‌గా మారింది.
ఎన్‌టీవీ కథనం ప్రకారం గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనలో కాన్పూర్‌కు చెందిన ఒక మహిళ, తన భర్త , అత్తమామలపై అత్యంత భయంకరమైన ఆరోపణలు చేసింది. తనను శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం 2023, జూన్ 22న లక్నోకు చెందిన నిశాంత్ కుమార్‌తో బాధిత మహిళ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు కుటుంబం భారీగా నగలు, రూ. 8 లక్షల నగదు మరియు 'మహీంద్రా థార్' కారును కట్నంగా ఇచ్చారు.
అయితే పెళ్లి అయిన కొన్న రోజులకు నిశాంత్ తీవ్ర అనారోగ్యం గురించి భార్యకు తెలిసింది. పెళ్లయ్యాక భర్త తనతో శారీరక సంబంధానికి ఆసక్తి చూపేవాడు కాదు. అత్త తన గదికి వచ్చి ఇద్దరి మధ్య పడుకునేది.. అలాగే, మామగారు అనుమతి లేకుండా గదిలోకి రావడం, ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. మరోవైపు అతని నిరంతరం మందులు తీసుకుంటూ, బాత్రూంలో ఎక్కువ సమయం గడిపేవాడు. దీంతో అనుమానం వచ్చి ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చి మెడికల్ రిపోర్టులు చూడగా, భర్త నిశాంత్‌కు రెండు కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్‌పై ఉన్నాడని తెలిసింది. ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని అత్తమామల్ని నిలదీయగా, "నీ కిడ్నీ అయినా ఇవ్వు లేదా పుట్టింటి నుండి రూ. 30 లక్షలు అయినా తీసుకురా" అని అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు నిశాంత్‌కు వేరే మహిళతో సంబంధం ఉందని, ఆ విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసు.
దీంతో ఆవేదన చెందిన ఆమె 2024 అక్టోబర్ 11న తన అత్తవారి ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె కాన్పూర్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పుట్టింటికి వెళ్లేటపుడు తన అత్తమామలు తన బ్యాగ్‌ను తనిఖీ చేసి, అందులోంచి నగలను తీసుకున్నారని ఆ మహిళ చెబుతోంది. ఆ తర్వాత ఆమె పుట్టింటికి తిరిగి వెళ్లి, అప్పటి నుంచి అక్కడే నివసిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, వరకట్నం వేధింపులు, మానసిక హింస, బెదిరింపుల సెక్షన్ల కింద ఆమె భర్త, అత్తమామలపై చకేరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్‌చార్జ్ అజయ్ ప్రకాష్ మిశ్రా తెలిపారు.


