ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ 201 పరుగులు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
సొంతమైదానంలో నామమాత్రపు స్కోరు
తదుపరి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 226 పరుగుల భారీ స్కోరు సాధించిన సన్‌రైజర్స్.. 161 పరుగులకే ప్రత్యర్థిని కుప్పకూల్చి జయభేరి మోగించింది. అయితే, సొంతమైదానంలో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. హైదరాబాద్ జట్టు కేవలం 156 పరుగులే చేయగా.. మరో బంతి మిగిలి ఉండగానే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదిలా ఉంటే.. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఆరంభ మ్యాచ్‌లకు దూరం కాగా ఇషాన్ కిషన్ (Ishan Kishan) సన్‌రైజర్స్ సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక కమిన్స్ రూపంలో కీలక పేసర్ సేవలను కూడా జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉన్నందువల్లే సన్‌రైజర్స్ రాణించలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి.
బ్యాటర్లు మరింతగా శ్రమించాల్సి ఉంది
ఈ విషయంపై సన్‌రైజర్స్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ తాజాగా స్పందించాడు. తమ వైఫల్యాలకు బ్యాటింగ్ విభాగమే ప్రధాన కారణమంటూ బౌలర్లను సమర్థించాడు. ఈ మేరకు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘గత మూడు మ్యాచ్‌లలో మేము 40 పరుగుల మేర వెనుకబడి ఉన్నాం అనిపించింది. కాబట్టి బ్యాటర్లు మరింతగా శ్రమించాల్సి ఉంది.
అతడు లేనిలోటు తీరనిది
ప్యాట్ కమిన్స్ వంటి ఆటగాడు లేకపోవడం ఏ ఫార్మాట్లోనైనా ఇబ్బందికరమే. జట్టుకు భారీ నష్టం కూడా! బ్రైడన్ కార్స్ చేతికి గాయమైంది. కాబట్టి మా ప్రణాళికల్లో మార్పు చేయాల్సి వచ్చింది. ఏదేమైనా మా జట్టు అనుభవం ఉన్న జట్టు. ముఖ్యంగా పేస్ దళం బాగుంది.
బ్యాట్‌తో మేము కష్టపడ్డ చోట మా వాళ్లు వికెట్లు తీయగలిగారు. బ్యాటర్లుగా మేము మాత్రం అనుకున్న మేర రాణించలేకపోయాము. ఓటములకు మా బౌలర్లను బాధ్యులను చేయడం సులువే.
అదనంగా 20- 30 పరుగులు చేసి ఉంటే
కానీ ఓడిన రెండు మ్యాచ్‌లలో మేము 20- 30 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా అయితే మా బౌలర్లు లక్ష్యాన్ని కాపాడగలిగి ఉండేవారు’’ అని హెన్రిచ్ క్లాసెన్ బౌలింగ్ విభాగానికి మద్దతుగా నిలిచాడు.
కాగా సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో హర్ష్ దూబే, జయదేవ్ ఉనాద్కట్, ఎషాన్ మలింగ, హర్షల్ పటేల్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడటం లేదు.
చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ అరెస్టు


