ఏబీఎన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళన.. పోలీసుల ఓవరాక్షన్‌ | Police Over Action With YSRCP Leaders At ABN Radha Krishna Office, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళన.. పోలీసుల ఓవరాక్షన్‌

Apr 7 2026 11:37 AM | Updated on Apr 7 2026 12:55 PM

Police Over Action With YSRCP Leaders AT ABN Office

సాక్షి, హైదరాబాద్‌: ఏబీఎన్‌ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఏబీఎన్‌ ఆఫీసును వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముట్టడించారు. ఆంధ్రజ్యోతి చెత్త రాతలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్‌ వద్దకు చేరుకున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓవరాక్షన్‌కు దిగారు.

ఏబీఎస్‌ ఆఫీసు బయట శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్‌ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ పోలీసు.. చంద్రశేఖర్‌ గొంతు పట్టుకుని ఆయనను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. అలాగే, పలువురు నేతల చొక్కాలు పట్టుకుని తోసేసే విధంగా ప్రవర్తించారు. దీంతో, పోలీసుల తీరు పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

నిరసనల్లో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ. విలువలు దిగజార్చేలా ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజం. మహిళలకు ఏబీఎన్‌ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా?. ఏబీఎన్‌ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్‌ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఒక చీటర్‌’ అంటూ మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement