మంచి ఆరోగ్యానికి..కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారమే ముఖ్యమని చాటిచెబుతూ ‘ఈట్ రైట్–స్టే హెల్తీ’ అనే నినాదంతో సోమవారం (06-04-2026) నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన వాకథాన్‌కు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ వాకథాన్‌ను మంత్రి దామోదర నర్సింహ ప్రారంభించి వాక్‌లో పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు.
హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


